Site icon Anirban Saha

Quedlinburg

Quedlinburg

Inside the church | www.anirbansaha.com

Quedlinburg

Read the post in English.

 

ప్రతిరోజు వెళ్ళే అవే క్లాస్సేస్, ఎప్పుడు ఉండే assignments నుంచి ప్రశాంతత కోసం వీకెండ్ లో IKUS వారి Quedlinburg యాత్ర కి వెళ్ళాలి అనుకున్నాం.

పొద్దున్నే వర్షం లో తడుస్తూ చలి లో వణుకుతూ లేట్ గా రైల్వే స్టేషన్ కి చేరుకొని Magdeburg కి గంట దూరం లో ఎంతో చరిత్ర కలిగిన Quedlinburg కి మా ప్రయాణం మొదలుపెట్టాం.

UNESCO వారి ప్రపంచ వారసత్వ నగరం గా గుర్తింపు పొందిన Quedlinburg లో 2000 కి పైగా ఎన్నో శతాబ్దాల నుంచి నిర్మిస్తూ వస్తున్న టింబర్ ఫ్రేమ్ ఇళ్లులు మరియు cobbled స్ట్రీట్స్ కనిపిస్తాయి. ప్రస్తుతం క్రిస్మస్ ఫెయిర్ కి సిద్ధమవుతుంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి కొంచెం కూడా ధ్వంసం అవ్వకుండా తన చరిత్రని వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తుంది. ఆ వీధుల్లో నడుస్తూ ఉంటె ఒకప్పటి యూరోప్ లో ఉన్న భావన అందరికి కచ్చితంగా కలుగుతుంది.

9వ శతాబ్దం లో నిర్మించబడిన నగరం అయినా కానీ ఇప్పటికి తన గుర్తింపు అలానే ఉంచుకుంది. మన దేశం లో ఎన్నో పురాతన పట్టణాలు తమ గుర్తింపును కోల్పోతున్నాయి. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఇప్పటికి కూడా తమ వారసత్వాన్ని వదలకుండా కొత్త ఇళ్లులు టింబర్ ఫ్రేమ్ తోటే నిర్మిస్తున్నారు.

 

Quedlinburg: 4 వివిధ దశాబ్దాలో నిర్మించిన భవనాలు.

.

Quedlinburg వీధులు

వాళ్ళ నిర్మాణ శైలి గురుంచి మాట్లాడాలి అంటే చాలా వరకు గోతిక్ శైలి లో నిర్మించినవే. మా టూర్ గైడ్ సబినే చెప్పిన ప్రకారం గోతిక్ శైలి కూడా romanasque మరియు renaissance నిర్మాణ శైలి కాలం నాటిదే. ఇవి కూడా Quedlinburg లో చాలా ప్రాముఖ్యత ఉన్నవి, వర్షం పడుతుండడంతో అవి చూడలేక పోయాం.

Quedlinburg | www.anirbansaha.com

చరిత్ర గురుంచి చెప్పాలంటే Quedlinburg గురుంచి చాలానే ఉంది జర్మనీ కి ఇది ఊయల లాంటిది అని చెప్పొచు. ఎందుకంటే Ottonian సామ్రాజ్య వ్యవస్తాపకులయిన Heinrich I కి ఎంతో ఇష్టమైన నగరం. Heinrich I జర్మనీ మొత్తాన్ని ఒకటి చేసి తన కొడుకైన Otto I ని రాజుని చేశాడు.

Quedlinburg ఎంతో మంది గొప్ప మహిళా నాయకురాలని చూసింది. Heinrich I వితంతువు అయిన Mathilde 30 సంవత్సరాలు పరిపాలించగా. తన మనవరాలు Mathlide పేరు మీదే 33 సంవత్సరాలు పరిపాలించింది. ఇలా పురుషులు యుద్ధాలు చేస్తూ ఉండగా 900 ల సంవత్సరాలు మహిళలు పరిపాలన చూసుకున్నారు. ఈ సమయం లోనే మహిళల చదువు కోసం స్కూల్స్ నిర్మించారు, స్వతంత్రంగా బ్రతికేల చేసారు. ఎంతో మంది పురుషులు మహిళా పరిపాలనని దేబ్బతీయడానికి ప్రయత్నించారు.

చుట్టూ చెరువు మధ్యలో కోట, cobbled స్ట్రీట్స్ తో,చర్చి లతో అందంగా ఉండే చిన్న నగరం Quedlinburg ని చూడగానే ప్రేమలో పడిపోతారు. జర్మనీకి వచ్చినవాళ్ళు కచ్చితంగా ఒక్కసారి అయినా చూడాల్సిన నగరం. మేము వెళ్ళిన రోజు వర్షంతో పాటు బాగా చలి ఉండడంతో ఎక్కువ తిరగలేకపోయం. ఈ వేసవి లో ఇంకోసారి వెళ్ళాలి అనుకుంటున్నాం.

సన్నటి cobbled స్ట్రీట్స్

.

cobbled స్ట్రీట్స్

.

కోట లోపల

.

చర్చి లోపల

.

Quedlinburg కోట.

.

కోర్ట్ అఫ్ ఆర్మ్స్ వారి చిహ్నం

.

టౌన్ హాల్

……

టౌన్ హాల్ దగ్గర నేను

మాకు ఎంతో ఓపికతో నగరం అంతా చూపించి దాని చరిత్ర గురుంచి వివరంగా చెప్పిన సబినే హౌసన్ కి మా ప్రత్యేక కృతజ్ఞతలు.

IKUS అనగా ఇక్కడ విద్యార్థుల సౌజన్యంతో నడిచే ఒక సంస్థ. జర్మనీ కి వచ్చిన అంతర్జాతీయ విద్యార్థులకి ఇక్కడ సంస్కృతి తెలుసుకోవడంలో సహాయ పడుతుంటారు.

Exit mobile version